ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జాయింట్ కలెక్టర్

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జాయింట్ కలెక్టర్

SS: పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ సోమవారం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పారదర్శకంగా విచారణ జరిపి, అర్జీదారులు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.