'విద్యార్థులు అందరూ ఒక లక్ష్యంతో చదవాలి'

'విద్యార్థులు అందరూ ఒక లక్ష్యంతో చదవాలి'

ప్రకాశం: తర్లుపాడు మండలం చెన్నారెడ్డిపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బాలరాజు అధ్యక్షతన చదువు ప్రాముఖ్యతపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్ని ఎడ్యుకేషనల్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు అందరూ క్రమ శిక్షణతో ఒక లక్ష్యంతో చదవాలని అన్నారు.