'ప్రజల ఇబ్బందులు తీరేలా పనుల ప్రణాళిక సిద్ధం చేయాలి'
SS: ప్రజల ఇబ్బందులు, సమస్యలు తీరే విధంగా పనుల ప్రణాళికలను సిద్ధం చేయాలని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ అధికారులకు సూచించారు. 15వ ఆర్థిక సంఘం నిధులపై తాడిమర్రి, బత్తలపల్లి, ధర్మవరం, ముదిగుబ్బ ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో ఆయన సమావేశమయ్యారు. ముఖ్యంగా తాగునీరు, డ్రైనేజీలు, రోడ్లు, స్మశాన వాటికలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.