నాట్య మయూరి పురస్కారం అందుకున్న ఆరాధ్య
NRML: నిర్మల్ పట్టణంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో సంస్కార భారతి నిర్మల్ జిల్లా సమితి, పాటే మా ప్రాణం సంగీత అకాడమీ ఆద్వర్యంలో నిర్వహించిన నృత్య పోటీలు ఆకట్టుకున్నాయి. ఈ పోటీల్లో శాంతినగర్ జర్నలిస్ట్ కాలనీకి చెందిన సంగారి ఆరాధ్య అత్యుత్తమ నృత్య ప్రదర్శన చేసి అందరినీ మెప్పించారు. దీంతో ఆమె నిర్వాహకుల చేతుల మీదుగా 'నాట్య మయూరి' పురస్కారాన్ని అందుకున్నారు.