రూ.2,700 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం

రూ.2,700 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం

ప్రధాని మోదీ పుదుచ్చేరిలో రూ.2,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ-బస్సులతో పాటు ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్, నీటి సరఫరా, మురుగునీటి పారుదల ప్రాజెక్టులను ప్రారంభించారు. అలాగే, 41 గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల ద్వారా పుదుచ్చేరి ప్రజలకు అత్యాధునిక వసతులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని అధికారులు స్పష్టం చేశారు.