రేషన్ కార్డు సర్వేలో పాల్గొన్న ఆర్మూర్ కాంగ్రెస్ ఇంఛార్జ్

NZB: నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఖుందవందన్పూర్ గ్రామంలో కొత్త రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు శనివారం సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఆర్మూర్ కాంగ్రెస్ ఇంఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. మహిళలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిజమైన పేదవారికి లబ్ది చేకూరాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని ఆయన తెలిపారు.