చీపురుతో కార్యాలయాన్ని శుభ్రం చేసిన ఎస్పీ
కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో పోలీసులు శనివారం 'స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర' కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో సహచర సిబ్బందితో కలిసి ఎస్పీ బిందు మాధవ్ చీపురు చేత పట్టి కార్యాలయాన్ని పరిశుభ్రం చేశారు. అనంతరం మొక్కలు నాటి, సిబ్బంది చేత స్వర్ణాంధ్ర కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.