VIDEO: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్
WNP: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలో కంటి వైద్య శిబిరాలు నిర్వహించి దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.