బొలెరో ఢీకుని ముగ్గురికి తీవ్ర గాయాలు
అన్నమయ్య: కురబలకోట మండలంలో జరుగుతున్న ముదివేడు దండు మారెమ్మ జాతరకు వస్తుండగా ఇవాళ ఓ ఆటో ప్రమాదానికి గురై ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంకు చెందిన సూర్య, రజిని కుమార్, ప్రకాశ్ ప్రయాణిస్తున్న ఆటోను పుంగనూరు బైపాస్ రోడ్డులో బొలెరో వాహనం ఢీకొట్టింది. గాయపడిన వారిని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.