విద్యుత్తు సరఫరాలో నేడు అంతరాయం
NLG: జిల్లాలో నేడు ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్తు సంస్థ ఏడీఈ వేణు గోపాలచార్యులు ఓ ప్రకటనలో తెలిపారు. రాంనగర్, దారుషాబాకాలనీ, మిర్యాలగూడ రోడ్డు ప్రాంతాల్లో విద్యుత్తు లైన్ల మరమ్మతుల కారణంగా చోటు చేసుకునే సరఫరా అంతరాయానికి వినియోగదారులు సహకరించాలని కోరారు.