బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

అనంతపురం జిల్లాకు చెందిన బీటెక్ యువతి ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకుంది. గుంతకల్లు పట్టణం హనుమేశ్ నగర్‌కు చెందిన నవ్య బీటెక్ CSE ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ క్రమంలో విద్యార్థిని హాస్టల్ గదిలో గురువారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా యువతి మృతికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.