'మత్స్య రైతులు NFDPలో నమోదు చేసుకోవాలి'
BHPL: జిల్లాలోని మత్స్యకారులు, మత్స్య రైతులు ‘జాతీయ మత్స్య డిజిటల్ పోర్టల్’ (NFDP)లో తమ వ్యక్తిగత, వృత్తి వివరాలు నమోదు చేసుకోవాలని జిల్లా మత్స్య శాఖ అధికారి విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. PM మత్స్య సంపద యోజన కింద నడుస్తున్న ఈ డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు అర్హత సులభంగా లభిస్తుందన్నారు.