గ్యాస్ కోసం గంటల తరబడి నిరీక్షణ

గ్యాస్ కోసం గంటల తరబడి నిరీక్షణ

GDWL: పెరిగిన ధరలు ఒకవైపు, దొరకని గ్యాస్ మరోవైపు సామాన్యుడిని కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయని అయిజ మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయిజ మున్సిపాలిటీలోని లక్ష్మీ శ్రీనివాస గ్యాస్ ఏజెన్సీ వద్ద మంగళవారం గ్యాస్ కోసం జనం బారులు తీరారు. ధర పెరిగినా సమయానికి గ్యాస్ అందక గ్రామాల నుండి వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.