సుబ్రమణ్యేశ్వర స్వామికి ఘనంగా షష్టి పూజలు

సుబ్రమణ్యేశ్వర స్వామికి ఘనంగా షష్టి పూజలు

VSP: కోటవురట్ల మండలం, రాట్నాల పాలెం, బీసీ కాలనీలో కుమారస్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్టి సందర్భంగా సుబ్రమణ్యేశ్వర స్వామికి పండితులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమం నిర్వహించారు. భక్తులు 108 కలశాలతో స్వామివారి నామస్మరణ చేస్తూ ఊరేగింపులో పాల్గొన్నారు. పూజ అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. స్వామివారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.