ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఆటో.. ఇద్దరికి తీవ్ర గాయాలు
MLG: ఏటూరునాగారం మండల కేంద్రంలో చిన్నబోయినపల్లి వెళ్ళే మార్గంలో బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఆటో ఢీ కొట్టి పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తో పాటు ఓ మహిళలకు బలమైన గాయాలైనట్లు ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు. క్షతగ్రతలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.