బహుదనదిలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా

అన్నమయ్య: కలికిరి మండలంలోని మేడికుర్తి బహుద నదిలో ఇసుక దొంగలు రెచ్చిపోయారు. ఎలాంటి అనుమతులు లేకుండానే వందల ట్రాక్టర్లు, టిప్పర్లతో యథేచ్ఛగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. విచ్చలవిడిగా ఇసుకను తరలిస్తున్నా, మైన్స్ అండ్ జియాలజీ అధికారులు గానీ, రెవెన్యూ అధికారులు గానీ అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం విశేషం. సంబంధించిన అధికారులు పట్టించుకోవాలని ప్రజలు కోరారు.