కరెంట్ షాక్‌తో బాలుడి మృతి

కరెంట్ షాక్‌తో బాలుడి మృతి

CTR: పుంగనూరు మండలంలో గురువారం విషాదం నెలకొంది. అరవపల్లి శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయ ఆవరణంలో ఆడుకుంటున్న రత్న కుమార్ కుమారుడు గజముఖన్(4) ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే స్థానికులు బాలుడిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.