'స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి సహకారం అవసరం'

GNTR: గుంటూరు పాత బస్టాండ్ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్‌లో స్వర్ణాంధ్ర–స్వచ్ఛఆంధ్ర కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో అందరూ తమ వంతు సహకారం అందించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.