VIDEO: ఆధ్వానంగా మారిన దేవాపూర్ రోడ్డు
ADB: తలమడుగు మండలంలోని దేవాపూర్ నుంచి భరంపూర్ వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. రోడ్డంతా భారీ గుంతలు పడటంతో వాహనదారులు ప్రయాణించాలంటేనే వణికిపోతున్నారు. రాత్రుళ్లు ఈ గుంతలు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఈ రహదారికి మరమ్మతులు చేపట్టి, ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.