లక్కీ డ్రా, లాటరీలు నిర్వహిస్తే చర్యలు : ఎస్పీ

లక్కీ డ్రా, లాటరీలు నిర్వహిస్తే చర్యలు : ఎస్పీ

ASF: జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో లక్కీ డ్రా, లాటరీలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో లక్కీ డ్రా, లాటరీ విధానంపై నిషేధం ఉందని తెలిపారు. గణపతి నవరాత్రి ఉత్సవాల అనుమతి తీసుకోవాలన్నారు.