పొదిలిలో పైప్‌లైన్‌‌కు మరమ్మతులు

పొదిలిలో పైప్‌లైన్‌‌కు మరమ్మతులు

ప్రకాశం: పొదిలి ఇస్లాంపేటలో పగిలిన పైప్‌లైన్‌ను మున్సిపల్ అధికారులు మరమ్మతులు చేశారు. ఆదివారం స్థానికులు సమాచారం ఇవ్వగానే స్పందించిన సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. పట్టణంలో పారిశుద్ధ్య పనులు గ్రీన్ అంబాసిడర్ల ద్వారా వేగంగా జరుగుతున్నాయని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. నీటి వృథాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.