'మేడే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు నిర్వహిస్తాం'

'మేడే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు నిర్వహిస్తాం'

MBNR: మేడే స్ఫూర్తితో ఐక్య పోరాటాలు నిర్వహిస్తామని కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ అన్నారు. షాద్ నగర్ పట్టణంలో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక హక్కులను కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని ఆయన హెచ్చరించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక చట్టాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు.