రూ.75 కోట్ల నిధులను కేటాయించాలని సీఎంకు వినతి

రూ.75 కోట్ల నిధులను కేటాయించాలని సీఎంకు వినతి

MNCL: దండేపల్లి మండలంలోని శ్రీ గూడెం గుట్ట సత్యనారాయణ స్వామి వారి దేవాలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.75 కోట్లను కేటాయించాలని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఈ విషయాన్ని సోమవారం బజార్హత్నూర్ మండలంలోని పిప్రి గ్రామంలో జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్లారు. తెలంగాణలో గూడెం సత్యనారాయణ స్వామి దేవాలయం ఒకటే ఉందని, నిధులను కేటాయించాలని కోరారు.