'మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి'

'మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్ అనుమతి తప్పనిసరి'

SKLM: వంగర మండలం శివ్వంలో ఎస్సై షేక్ శంకర్ మాట్లాడుతూ..వినాయక మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో అనుమతి తప్పనిసరి అని తెలిపారు. గ్రామస్తులకు వినాయక మండపాల ఏర్పాటుపై అవగాహన కల్పించారు. డీజే శబ్దాలతో ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని మండపాలు సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని సూచించారు. రాజకీయ మతపరంగా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించకూడదని హెచ్చరించారు.