5 కిలోల కణితి తొలగింపు

ADB: మహారాష్ట్ర కిన్వట్‌కు చెందిన ఓ బాలిక కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతుండేది. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో ఈ నెల 8న చేరగా స్కానింగ్ చేసి కడుపులో కణతి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. శుక్రవారం వైద్యులు లోపరోటోమీ శస్త్ర చికిత్స చేసి 5 కిలోల కణతిని తొలగించారు. చికిత్స అనంతరం బాలిక కోలుకుంటుందని వైద్యులు అశోక్, శ్రీకాంత్, సుప్రజా తెలిపారు.