కోటిలింగాల గోదావరి నదిలో గుర్తు తెలియని మృతదేహం
JGL: వెల్గటూర్ మండలం కోటిలింగాల గోదావరి పుష్కర ఘాట్ల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైది. సమాచారం అందుకున్న ఎస్సై ఉదయ్ పారిశుధ్య కార్మికుల సహాయంతో మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చారు. మృతుడు లేత ఆకుపచ్చ రంగు షర్ట్, నలుపు రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. స్నానానికి నదిలో దిగి ప్రమాదవశాత్తు మునిగి చనిపోయాడా, లేక వరద తాకిడికి కొట్టుకు వచ్చిందా అన్నది తెలియాల్సి ఉంది.