25వ వార్డును సందర్శించిన ఛైర్‌పర్సన్, కమిషనర్

25వ వార్డును సందర్శించిన ఛైర్‌పర్సన్, కమిషనర్

WGL: నర్సంపేట 25వ వార్డును మున్సిపల్  ఛైర్‌పర్సన్ పెండెం లక్ష్మీ రామానంద్, కమిషనర్ భాస్కర్, మున్సిపల్ వైస్ ఛైర్మన్ నరేందర్ గుప్తా సందర్శించారు. వార్డులో డ్రైనేజీ, సీసీ రోడ్లు, పారిశుద్ధ్య పనులను ఆమె పరిశీలించారు. నర్సంపేటను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. నర్సంపేట అభివృద్ధికి సమన్వయంతో పని చేద్దామని పట్టణ వాసులకు పిలుపునిచ్చారు.