తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన సురవరం: ఎంపీ

KMM: సీపీఐ మాజీ ప్రధాన జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మృతి పట్ల ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసి.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారని ఎంపీ పేర్కొన్నారు.