మంత్రి సమక్షంలో టీడీపీలో చేరికలు
VZM: గంట్యాడ మండలంలోని పెంటశ్రీరాంపురం గ్రామానికి చెందిన 25 కుటుంబాలు వైసీపీను వీడి సోమవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో టీడీపీలో చేరారు. మాపై నమ్మకంతో పార్టీలో చేరినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యకర్తలకు కష్టసుఖాల్లో అండగా ఉండే పార్టీ టీడీపీ అని చెప్పారు. ఇందులో మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర నాయుడు పాల్గొన్నారు.