‘కరెంట్ కోతలు ఉండొద్దు, LNG కొరత రాకూడదు’

‘కరెంట్ కోతలు ఉండొద్దు, LNG కొరత రాకూడదు’

యుద్ధం కారణంగా ఎరువుల ఉత్పత్తికి అవసరమైన LNG కొరత ఏర్పడకుండా చూడాలని ప్రధాని మోదీ అధికారులతో సమావేశంలో సూచించారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తికి ఎక్కడా ఆటంకం కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయ రంగానికి అవసరమైన ఎరువుల సరఫరాలో లోటు రాకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఇంధన, వ్యవసాయ రంగాల సుస్థిరతకు ప్రాధాన్యం ఇవ్వాలని మోదీ పిలుపునిచ్చారు.