'చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్‌లు దూరంగా ఉంచండి'

'చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్‌లు దూరంగా ఉంచండి'

ప్రకాశం: పామూరు మండలం చట్టుమడుగు అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ పక్వాడా పక్షోత్సవాన్ని ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎం.వీ.ఎస్. పార్వతి నిర్వహించారు. గర్భిణీలు, బాలింతలు, మహిళలకు పోషకాహారం‌పై అవగాహన కల్పించారు. చిన్నారులకు తొలి రెండేళ్లలో మెదడు అభివృద్ధి కీలకమని పేర్కొన్నారు. చిరుధాన్యాల ప్రయోజనాలు వివరించి, చిన్నారులను మొబైల్, టీవీలకు దూరంగా ఉంచాలని సూచించారు.