తమ్మున్ని స్వదేశానికి తీసుకురావాలని వినతి

NZB: బహ్రెయిన్‌లో భవనంపై నుంచి కిందపడి తీవ్రంగా గాయపడిన సిరికొండ (M) చీమన్పల్లికి చెందిన ప్రసాద్‌ను స్వదేశానికి రప్పించాలని ఆయన సోదరి లత CM ప్రజావాణిలో కోరారు. ప్రజావాణిలో సీఎంను కలిసిన ఆమె సోదరుడిని భారత్‌కు తీసుకురావాలన్నారు. ఎన్నారై అడ్వైజర్ కమిటీ వైస్ ఛైర్మన్ భీమిరెడ్డి ద్వారా ఇండియాకు రప్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే భూపతిరెడ్డి హామీ ఇచ్చారు.