ముస్లింలకు రంజాన్ కానుకలను అందజేస్తున్న నాయకులు
SRCL: రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రభుత్వం సరఫరా చేసిన రంజాన్ కానుకలను గురువారం ముస్లింలకు అందజేశారు. కోనరావుపేట మండలం నిమ్మపెళ్లి గ్రామంలో సర్పంచ్ కుమ్మరి స్వప్న ఆధ్వర్యంలో ముస్లింలకు కానుకలను అందజేశారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.