స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

NLG: దేవరకొండలో ఎమ్మెల్యే బాలునాయక్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం, రాజస్వ మండలాధికారి కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం త్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకున్నారు.