'నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు'
ELR: వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించే వైద్యులు, వైద్య సిబ్బందిని సస్పెండ్ చేస్తానని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. నూజివీడు ఏరియా ఆసుపత్రిని బుధవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ప్రతీ వార్డు, వైద్య విభాగాన్ని పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించాలన్నారు.