రేపు వెల్దుర్తిలో ప్రజాదర్బార్
PLD: వెల్దుర్తిలోని ఎమ్మెల్యే కార్యాలయంలో రేపు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆధ్వర్యంలో 'ప్రజాదర్బార్' నిర్వహించనున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకు వివరించి, అర్జీలను సమర్పించవచ్చని కార్యాలయ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ సమస్యలకు త్వరితగతిన పరిష్కారం పొందాలని వారు కోరారు.