ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

స్వీడన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్టాక్‌హోమ్‌లో ఓ సిటీ బస్సు అకస్మాత్తుగా బస్‌స్టాప్ క్యూలో నిల్చున్న ప్రజలపైకి దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే ఆరుగురు మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణికులు లేరని అక్కడి అధికారులు వెల్లడించారు. తీవ్రంగా గాయపడిన బస్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.