ఉపాధి పనులు బంద్ కరపత్రం ఆవిష్కరణ

ELR: మహాత్మ జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో పనిచేస్తున్న కూలీల యొక్క సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పీ.రామకృష్ణ డిమాండ్ చేశారు. అదివారం ఏలూరులో మే 20వ తేదిన ఉపాధి పనులు బంద్ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ముద్రించిన కరపత్రం ఆవిష్కరణ చేశారు. ఉపాధి కూలీలు పనిచేస్తున్న ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు.