లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవిత్ర ఉత్సవాలు

RR: షాద్ నగర్ పట్టణంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహా కుంభ సంప్రోక్షణ, పవిత్ర ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం నిత్యసేవాకాలం, సుదర్శన హోమం, నిత్య పూర్ణాహుతి,వేదాది విన్నపాలు తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరయ్యారు. ఆధ్యాత్మిక పూజ కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.