జిల్లా నుంచే తెలుగు తొలి రామాయణం

NGKL: జిల్లా నుంచి తెలుగులో తొలి రామాయణం వెలువడింది. దీని పేరు రంగనాథ రామాయణం. దీనిని కాకతీయుల కాలంలో బిజినేపల్లి మండలం నందివడ్డేమాన్ ప్రాంతాన్ని పాలించిన గోన బుద్ధారెడ్డి 1294-1300 మధ్య కాలంలో రచించారు. దీన్ని పూర్తిగా ద్విపద ఛందస్సులో రాశారు. గోన బుద్ధారెడ్డి తన తండ్రి కోరిక మేరకు ఈ రామాయణాన్ని లిఖించారు. ఆయన యుద్ధకాండ వరకు రచించారు.