వైరల్ వీడియో: 'ఇవి పాములు కావు, చేపలు'

వైరల్ వీడియో: 'ఇవి పాములు కావు, చేపలు'

కృష్ణా: నాగాయలంక రామలింగేశ్వర స్వామి ఆలయ కొలనులో వందలాది నీటి పాములు సంచరిస్తున్న వీడియో SM‌లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై నెటిజన్‌లు యాదృచ్ఛికమని కామెంట్ చేయగా, మరికొందరు ఇది శివయ్య మహిమేనని చెప్పుకొచ్చారు. అయితే, తాజాగా అసలు విషయం బయటకొచ్చింది. కొలనులో కనిపించేవి పాములు కావని, చేపలని స్థానికులు తెలిపారు. అయినప్పటికి ఇవి పాముల వలే కనిపిస్తున్నాయి.