భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

దక్షిణ అమెరికా డ్రీక్ పాసేజ్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5గా నమోదైంది. భూ ఉపరితలానికి 11 కి.మీ లోతున భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. భూప్రకంపనల నేపథ్యంలో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో చిలీ దేశం అప్రమత్తమైంది. తీర ప్రాంతాలను అప్రమత్తం చేసింది. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది.