నూతన రోడ్డును ప్రారంభించిన ఎంపీ

నూతన రోడ్డును ప్రారంభించిన ఎంపీ

కృష్ణా: కంకిపాడు మండల పరిధిలోని కాసరనేనివానిపాలెం నుంచి మద్దూరు రోడ్డును మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలసౌరి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. రూ.1.40 కోట్లు నాబార్డ్ నిధులతో ఈ రోడ్డును అభివృద్ధి చేసినట్లు వారు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని ఎంపీ, ఎమ్మెల్యే పేర్కొన్నారు.