'గురువు మల్లారెడ్డిని సన్మానించిన రెడ్యం'

KDP: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వైసీపీ కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఖాజీపేటలో తన గురువు, గణిత ఉపాధ్యాయులు బత్తల మల్లారెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం వారి ఆశీర్వాదం తీసుకున్నారు. “అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించే వారే గురువులు,” అని రెడ్యం తెలిపారు. కాగా, ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.