'సంసార సాగరంలో స్త్రీ ఎంతో సహనాన్ని వహిస్తుంది'
KKD: సంసార సాగరంలో స్త్రీ ఎంతో ఓర్పుగా వహిస్తుందని జిల్లా మహిళా అధ్యక్షురాలు భూరా కృష్ణవేణి అన్నారు. తొండంగి (M ) గోపాలపట్నంలో మహిళా దినోత్సవ వేడుకలు 100 మంది మహిళలతో ఘనంగా నిర్వహించారు. సమాజంలో స్త్రీ యొక్క పాత్ర వెలకట్టలేనిదన్నారు. ఎంతో ఓర్పు సహనంతో సంసార సాగరాన్ని నడపగలిగే శక్తి స్త్రీకి మాత్రమే ఉందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికి స్వీట్లు పంచారు.