మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
కృష్ణా: మధ్యాహ్న భోజన నాణ్యతపై ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ విజయవాడ రూరల్ నిడమానూరు జడ్పీ హైస్కూల్‌లో డొక్కా సీతమ్మ పథకాన్ని పరిశీలించారు. స్వయంగా ఆహారం రుచి చూసి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భోజనం రుచిగా, శుచిగా ఉండాలని, ప్రతి రోజు ఉపాధ్యాయుడు ముందుగా భోజనాన్ని రుచి చూడాలని అధికారులకు ఆదేశించారు.