ఉత్తమ అవార్డు అందుకున్న ఎంపీడీవోకు సన్మానం

KMM: ఇటీవల ఉత్తమ ఎంపీడీవో అవార్డు అందుకున్న నేలకొండపల్లి ఎంపీడీవో ఎర్రయ్యను ఇవాళ నేలకొండపల్లి గ్రామస్తులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంపీడీవోను గ్రామస్తులు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా పట్ల ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఉత్తమ ఎంపీడీవో అవార్డుతో సత్కరించిందని గ్రామస్తులు పేర్కొన్నారు.