కాతేరులో రేపు 'రా కదిలిరా' బహిరంగ సభ

తూ.గో: రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కాతేరులో సోమవారం జరగనున్న టీడీపీ 'రా కదిలి రా' బహిరంగ సభను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అనపర్తి పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బహిరంగ సభకు అనపర్తి నియోజకవర్గం నుంచి భారీగా టీడీపీ, జనసేన శ్రేణులు తరలిరావాలని కోరారు.