అప్పట్లో రాహుల్ ద్రవిడ్‌నూ విమర్శించారు: ఉతప్ప
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీనిపై మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప స్పందించాడు. ప్లేయర్లు పరుగులు చేయడంలో విఫలమైతే దానికి కోచ్ గంభీర్ ఏం చేస్తాడని ప్రశ్నించాడు. గంభీర్ స్వయంగా వచ్చి మ్యాచ్ ఆడలేదని కదా.. గతంలో రాహుల్ ద్రవిడ్‌ను సైతం ఇలాగే విమర్శించారని గుర్తు చేశాడు.