VIDEO: వైకుంఠపురానికి పోటెత్తిన భక్తులు
సంగారెడ్డి పట్టణ శివారులోని వైకుంఠపురంలో ఇవాళ భక్తులు పోటెత్తారు. దర్శనం కోసం క్యూ లైన్ కట్టారు. మార్గశిర మాసం, శుక్లపక్షం, నవమి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి గోదా సమేత శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రంలో ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకం, నరసింహ హోమం పూజలు చేశారు.